TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిన చిరుత.. ఎక్కడంటే?

Published on: Tue Apr 29, 2025 2:28PM

 

తమిళనాడు నీలగిరి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీస్ స్టేషన్ లోకి చిరుతపులి ప్రవేశించింది. రాత్రిపూట ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చి గదిలో కలియతిరిగింది. లోపల ఎవరూ కనిపించకపోవడంతో కాసేపటి తర్వాత తిరిగి వెళ్లిపోయింది. ఊటీ సమీపంలోని నడువట్టం పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి ఘటన  జరిగింది. అది గమనించిన ఓ కానిస్టేబుల్ అలర్ట్ అయ్యారు. 

లోపల ఎవరు కనిపించకపోవడంతో అక్కడి నుంచి పులి బయటకు వెళ్లిపోయింది. లోపల ఉన్న కానిస్టేబుల్ వెంటనే తలుపులు మూసేశారు.నడువట్టం ప్రాంతంలో చిరుతల సంచారం ఇటీవల ఎక్కువైందని, ఫారెస్ట్ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంది వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది