TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహేష్ తో మిల్కీ బ్యూటీ

Published on: Mon Jun 17, 2013 11:10AM

 

tamanna mahesh babu, mahesh babu tamanna, tamanna hot, mahesh babu

 

 

సినిమాల్లో రాణించాలంటే.. అందం, అభినయంతోపాటుగా కాస్తంత అదృష్టం కూడా ఉండితీరాలి. అయితే.. తమన్నాకు మాత్రం అందం, అభినయంతోపాటుగా అదృష్టం పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్నట్లున్నాయి. లేకపోతే.. ఓసారి దూరమైన అవకాశం మళ్లీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లడమేంటి. అది కూడా సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన నటించే అవకాశం ఏరికోరి ఆమెను వరించడమేంటి..?

 

ఏం చేస్తాం.. తమన్నా సుడి ఆ రేంజ్‌లో తిరుగుతోంది. అసలైతే.. మహేష్‌_సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న "ఒన్ నేనొక్కడినే" చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాను తీసుకోవాలనుకున్నారు. కానీ.. తమన్నా డేట్స్ ఆ సమయానికి ఖాళీలేనందున ఆ సదవాకశం కృతిసనమ్ దక్కించుకుంది.


ఇప్పుడు.. తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌ నటించనున్న "ఆగడు" చిత్రంలో నాయికగా తమన్నా ఎంపికవ్వడం ఫిలింనగర్‌లో చర్చనీయాంశంగా మారింది. "దూకుడు" వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత శ్రీనువైట్ల_మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం విశేషం.


మరి ఈ చిత్రంతో తమన్నా పొజిషన్ టాలీవుడ్‌లో నెం.1 స్థానానికి ఎగబాకడం ఖాయం!