TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చప్రాసీ నుండి చైర్మన్ అయ్యా

Published on: Thu Jul 3, 2014 4:25PM

 

తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్‌గా ఎన్నికైన స్వామిగౌడ్‌కు పలువురు బుధవారం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ...''ఒకప్పుడు చప్రాసీగా పనిచేసిన నేను ఈ రోజు శాసనమండలి చైర్మన్ అయ్యా. ఇది ప్రజాస్వామ్యానికే గొప్ప విజయం. తెలంగాణ ఉద్యమంలో, సాయుధ పోరాటంలో అమరులయిన వారి త్యాగాలు నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. నాకు కేసీఆర్ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నన్ను అందరూ చైర్మన్ స్థానం వద్దకు తీసుకెళ్తుంటే నాకు నోట మాట రాలేదు. మండలిలో చైర్మన్ స్థానానికి సభ్యులు గౌరవం ఇవ్వండి. నాకు కాదు'' అని తెలంగాణ శాసనమండలి నూతన చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు.



సభలో ఉన్న మేధావులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయుల కంటే నేను రాజకీయంగా చిన్నవాడిని. కాని సభ నడిపే విషయంలో అందరినీ కలుపుకుని ముందుకు తీసుకువెళ్తాను. సభలో సభ్యుల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాను అని స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ శాసనమండలిని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతానని ఆయన తెలిపారు. చట్టసభల వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని, బలహీన వర్గాలు, దళితులు, నిరుద్యోగులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారని, వారి ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన అన్నారు.