ఆంటీని కాదు...అతిలోకసుందరినే..!
Published on: Thu Dec 13, 2012 4:36PM

శ్రీదేవి నిర్మాత బోనీకపూర్ ని పెళ్ళిచేసుకుని ఇద్దరు అమ్మాయిలకు తల్లైన కూడా నేను ఆంటీని కాదు అతిలోకసుందరినే అనుకుంటోందట..! ఆంటీలకు ఇచ్చినట్లు నాకు చీప్ గా ఓల్డ్ రోల్స్ ఇవ్వద్దు...అలాంటి పాత్రలు చేయడానికి నాకు ఇష్టం లేదంటోంది. ఎంత అతిలోక సుందరైతే మాత్రం ఆంటీ అయ్యాక కూడా అంటీ రోల్స్ ఇవ్వంద్దంటే ఎలా అని చెవులు కోరుక్కు౦టున్నారు.
ఇంగ్లిష్ వి౦గ్లిష్ మూవీతో సేకండ్ ఇనింగ్స్ చేసిన శ్రీదేవి తనలో ఇంకా ఏ మాత్రం పవర్ తగ్గలేదని నిరూపించుకుంది నిజమే....అయితే అంతమాత్రానికే అన్ని యంగ్ రోల్స్ కావాలనుకోవడానికి ఈవిడింకా "పదహారేళ్ళ వయస్సు" సినిమాలో శ్రీదేవి అనుకుంటుందా అని జనం కిసుక్కుమంటున్నారట! మాజీ అతిలోక సుందరి అప్పీల్ ను ఫిల్మ్ మేకర్లు ఎలా స్వికరిస్తారో మరి..!


