TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా దుష్ప్రచారం.. చర్యలు తప్పవన్న టీటీడీ

Published on: Thu Jul 3, 2025 9:28AM

తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది. టీటీడీ పై దుష్ప్రచారం చేస్తే దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పై చెడు ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో  వైసీపీ నేతలు, శ్రేణులు అదే పనిగా పెట్టుకున్నారు. 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ద్వేషం తప్ప మరో సిద్ధాంతం అంటూ లేనట్లుగా వైసీపీ వ్యవహారశైలి ఉంది.  టీటీడీ గోశాల వివాదం, అన్యమత ప్రార్థనలు, వేద పారాయణంపై మాజీ పాలకమండలి అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. . 

తాజాగా జూన్ 29  మధ్యాహ్నం తిరుమలలోని అఖిలాండం వద్ద ఎలాంటి లైసెన్స్ లేని అనాధికార ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తూ భక్తులకు ఇబ్బంది కలిగించారు.

అక్కడే విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ ఫొటోగ్రాఫర్ ను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మాట మాట పెరిగి వివాదం పెద్దది అయ్యింది. గొడవ పడుతూ ఆస్థాన మండపం లోని షాపు నెంబరు 96 వద్ద గొడవపడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ షాపులో పని చేస్తున్న ఫొటోగ్రాఫర్ ను వివరణ కోరారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు తీరు కూడా అతని విధులకు విరుద్ధంగా ఉండడంతో అతడిని తిరుపతి కి బదిలీ చేశారు. అసలు వాస్తవం ఇది కాగా..  ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా చానెళ్లు  తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బం ది అంటూ ప్రసారాలు చేశాయి. దీనిని టీటీడీ తీవ్రంగా ఖండించింది.   అదే విధంగా తరచూ టీటీడీపై అసత్యవార్తలను ప్రసారం చేస్తూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమనీ, కఠిన చర్యలు తీసుకుంటామనీ టీటీడీ హెచ్చరించింది.