సోనియాతో తెలంగాణా కాంగ్రెస్ ఎంపిల భేటీ
Published on: Thu Dec 6, 2012 1:39PM
.gif)
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపిలు ఈ ఉదయం సమావేశం అయ్యారు. ఈ సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు జరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం విషయం ఫై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ఈ అంశం ఫై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎంపిలు సోనియాను కోరినట్లు సమాచారం.
తెలంగాణా ప్రాంతంలో ఉన్న సమస్యలను కూడా వారు తమ నాయకురాలికి వివరించారు. అయితే, సోనియాతో తాము జరిపిన చర్చల వివరాలను మీడియా కు చెప్పమని ఎంపి లు అన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ అజాద్, అహ్మద్ పటేల్ లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అఖిల పక్షం సమావేశం తర్వాత తెలంగాణా ఫై స్పష్టత వస్తుందని ఎంపిలు అన్నారు. ఆ సమయంలోనే తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అసలు రంగు కూడా బయట పడుతుందని వారన్నారు.


