TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్రికెటర్ సురేష్ రైనాతో శ్రుతి హాసన్ డేటింగ్..!

Published on: Fri May 30, 2014 3:28PM

 

 

 

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్ మెన్, ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనాతో కమల్ హాసన్ కూతురు, క్రేజీ హీరోయిన్ శ్రుతి హాసన్ డేటింగ్ చేస్తున్నట్లు ఓ హాట్ న్యూస్ మీడియాలో ప్రచారం చేస్తోంది. క్రికెటర్లతో సినిమా కథానాయికలు ప్రేమాయణం సాగించడం కొత్తేమి కాదు. గతంలో చాలా మంది ఇండియన్ క్రికెటర్లు బాలీవుడ్ ముద్దుగుమ్మలతో ఎఫైర్లు కొనసాగించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఇండియన్ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి కూడా బాలీవుడ్ భామ అనుష్క శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు వరుస కథనాలు కూడా వచ్చాయి. లేటెస్ట్ గా శ్రుతి హాసన్ సురేష్ రైనాతో కలిసి డేటింగ్ లాంటి వ్యవహారాలు నడుపుతోందంటూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. శ్రుతి గత ఐపీఎల్ సీజన్ లో చెన్నై మ్యాచ్ లకు హాజరై తన మద్దతు తెలుపుతూ సందడి కూడా చేసింది. అయితే ప్రస్తుతం తాను షూటింగ్ లతో బిజీగా ఉండడంతో ఖాళీ దొరికినప్పుడు చెన్నై పార్టీలకు మాత్రం హాజరవుతుందట. ఐపీఎల్ 7లో సూపర్ జోష్ లో వున్న సురేష్ రైనా అసలు రహస్యం ఇదేనని సోషల్ మీడియాలో కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు.