రామ్ సరసన షాజాన్ పదాంసీ
Published on: Sun Mar 17, 2013 12:24PM

తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా... ముద్దులొలికే అందాలతో... ప్రేక్షకులను కట్టిపడేసింది షాజాన్ పదాంసీ. ఆ తరువాత... బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, సరైన అవకాశాలు రాకపోవడంతో... బ్యాక్ టు పెవిలియన్ అంటూ.... మళ్లీ టాలీవుడ్ కు వచ్చేసింది. గతంలో ఆమె అందాలు బాగానే కనువిందు చేయడంతో... వెంకటేశ్, రామ్ నటిస్తున్న మల్టీస్టారర్ లో మంచి ఛాన్సే దక్కించుకుంది ఈ బ్యూటీ. రామ్ సరసన హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరి... ఈ సినిమా అయినా....పదాంసీ కలిసి వస్తుందో లేదో తెలియాలంటే... మరి కొన్ని రోజు ఆగాల్సిందే...!


