గోడకూలి ఏడుగురి మృతి
Published on: Tue Aug 12, 2014 5:56PM

రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. గోడ కూలిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ముగ్గురు మహిళలు, నలుగురు బాలికలు వున్నారు. రాజస్థాన్‌లోని కల్మాంద గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు ఒక భారీ గోడ కూలడంతో, ఆ గోడ పక్కనే నివాసం ఏర్పాటు చేసుకున్న కుటుంబంలో ఏడుగురు మరణించారు. గోడ పక్కన తడికలు, ప్లాస్టిక్ కాగితాలతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసం కావడంతో ఎక్కువ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది.


