సెప్టెంబరు 7 టెన్షన్ టెన్షన్

 

September 7 face off planned in Hyderabad, two rallies on Sep 7

 

 

సమైక్యాంధ్ర డిమాండ్ చేస్తూ లక్షమందితో హైదరాబాద్ తో పమైక్య సభను నిర్వహిస్తాం అని ఏపీఎన్జీవోల సంఘం నిర్ణయించింది. అదే జరిగితే అదే రోజు తాము కూడా హైదరాబాద్ లో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలంగాణ జేఏసీ నేతలు చెబుతున్నారు. దీంతో సెప్టెంబరు 7న హైదరాబాద్ లో ఏం జరుగుతుందా ? అన్న ఉత్కంఠ నెలకొంది. ఎవరు అడ్డువచ్చినా హైదరాబాద్ లో సమైక్య సభ నిర్వహించి తీరుతామని ఏపీఎన్జీవో నేతలు చెబుతుంటే దానికి పోటీగా ర్యాలీ చేయాలని తెలంగాణ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇప్పటికే హైదరాబాద్ లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విభజన రేఖ పడిపోయింది. పోటాపోటీగా ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యమాలు నడుస్తున్నాయి. తెలంగాణ ఉద్యోగులకు మద్దతుగా విద్యార్థి జేఏసీ కూడా ర్యాలీలు తీయాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే నెల 4 నుండి 7 వరకు శాంతిర్యాలీలు, 7న మిలియన్ మార్చ్ కు అనుమతి ఇవ్వాలని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. లాల్ బహదూర్ స్టేడియం, నిజాం కళాశాల ప్రాంతాల పరిధిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.