ఉద్యోగులు ఒక్కరుగా సమ్మె నుండి విరమణ

 

 

 

సీమాంధ్ర ఉద్యోగులు ఒక్కరుగా సమేనుండి విరమిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలకు కరెంటు కష్టాలు తీరనున్నాయి. పిల్లలు స్కూళ్ళకు వెళ్లనున్నారు. ఇది మంచి పరిణామమే. అయితే సమ్మె విరమించిన ఉద్యోగస్తుల జె.ఏ.సి లు మాత్రం తమ సమస్యలపై ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించారని, రాష్ట్రం విడిపోకుండా చూసే భాధ్యత తనదని హామీ ఇచ్చినందున సమ్మె విరమిస్తున్నట్లు వారు చెబుతున్నారు. మరి మరో వైపు కేంద్రం నుండి పెద్ద సంఖ్యలో బలగాలు సీమాంధ్ర లో మోహరిస్తున్నాయి. మరో పక్క కేంద్ర హోమంత్రి షిండే అసెంబ్లీ కి తీర్మానం రాదనీ బిల్లు మాత్రమే వస్తుందని చెపుతున్న నేపధ్యంలో రాష్ట్ర విభజన జరగకుండా ముఖ్యమంత్రి ఎలా ఆపగలరొ ప్రజలకు ఏమి అర్ధం కాని గందరగోళ పరస్థితి నెలకొంది. ఉద్యోగస్తులు వారి సమస్యల విషయమై హామీ పొందారు సరే,కాని సామాన్య ప్రజానీకమైన రోజు కూలీలు మిగిలిన బడుగు బలహీన ప్రజలకు ఎవరు ఎలాంటి హామీ ఇస్తారని పలువురు సందేహ పడుతున్నారు. ఈ సమ్మె నేపధ్యం లో సామాన్య ప్రజానీకమే ఈ 72 రోజులుగా నానా యాతనలు పడ్డారే కానీ ఏ నేతలు కాదు. మరి ఏ ఒడంబడికల నేపధ్యంలో సమ్మె విరమించుకున్నారో సదరు ఉద్యోగస్తుల జె.ఏ.సి లు ఇన్నాళ్ళు సమ్మె ల తో అష్ట కష్టాలు అనుభవించిన ఈ సామాన్య ప్రజానీకానికి మాత్రం వివరించ వలసిన బాధ్యత ఉన్నదని విశ్లేషకులు సూచిస్తున్నారు.