సీమాంధ్ర జిల్లాలలో సోనియా సమాధులు

 

 

 

సోనియాగాంధీకి సమాధులు కడితే మా మీద కేసులు పెట్టాలని చిరంజీవి అంటున్నారు. ఇక ముందు ఆయనకు సమాధులు కట్టే రోజు ముందుంది. తెలంగాణ రాష్ట్ర విభజనతో సీమాంధ్ర విద్యార్థుల జీవితాలకు సమాధులు కడితే నోరు మెదపలేని వారు సోనియాగాంధీ చిత్రపటానికి సమాధి కడితే గగ్గోలు పెడుతున్నారు” అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో సోనియా చిత్రపటాలకు సమాధులు కడతామని, ఏం చేస్తారో చేయండని సవాల్ విసిరారు.

 

 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిర్యాని కోసం ఆరాట పడుతున్నాడని, సీమాంధ్రులది రాగి ముద్దల కోసం సాగుతున్న పోరాటం అని అన్నారు. కేంద్రమంత్రులు, కాంగ్రెసు నేతలు విభజన జరుగుతుంటే, సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు ? వీరంతా సీమాంధ్ర ప్రయోజనాలకు సమాధి కట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ? సమాధులు కట్టినందుకు మా మీద కేసులు పెడతారా ? అప్పుడు సీమాంధ్ర సమాజం మా త్యాగాన్ని గుర్తిస్తుంది అని పయ్యావుల అన్నారు.