ఢిల్లీ రేప్ విక్టిమ్ కూడా దోషే: ఆసారాం బాపు సంచలనం
Published on: Mon Jan 7, 2013 2:55PM

ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు పై ఆధ్యాత్మిక గురువు అసారాం బాపు సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలు కూడా దోషేనని అసారాం బాపు అన్నారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మాత్రమే దోషులు కారని, రేపిస్ట్ కూడా దోషేనని వ్యాఖ్యానించారు. తనపై రేప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వారిని అన్న అని వేడుకోవాల్సిందని అన్నారు.
ఒక చేతితో చప్పట్లు రావని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, బాధితురాలు మర్యాదపూర్వకంగా వేడుకోనివుంటే తనకి ఈ గతి పట్టి ఉండేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిందితులను కటినంగా శిక్షిస్తే చట్టాలు దుర్వ్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని ఆయన అన్నారు.
గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షించాలని దేశమంతటా ప్రజలు డిమాండ్ చేస్తుంటే, అసారాం బాపు మాత్రం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సంచలం సృష్టించింది.


