సినీ రైటర్ గా ఫెయిల్ అయిన చేతన్ భగత్
Published on: Fri Mar 15, 2013 6:16PM

రచయితగా ఎంతో పాపులర్ అయ్యి ఉండొచ్చు... కానీ సినిమాకు సంబంధించి... ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ ను అందిపుచ్చుకుంటేనే అసలు సిసలు సినీరచయిత అవగలరు. పాపం అది తెలుసుకోలేకే... బోల్తాపడ్డాడు... ప్రముఖ రచయిత చేతన్ భగత్. విషయంలోకి వెళితే... తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “కిక్” సినిమా సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఈ మూవీకి స్క్రిప్ట్ రాసే బాధ్యత భుజానేసుకున్నాడు చేతన్ భగత్. తీరా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి... సల్మాన్ కు చూపిస్తే... ‘తెలుగు 'కిక్' లో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ ఇందులో లేవని పెదవి విరిచేశాడట. దీంతో పాపులర్ రచనలు చేసిన తాను... ఓ కమర్షియల్ మూవీ కథకు హంగులద్దాలేక పోయానని మధన పడిపోతున్నాడు ఈ క్రియేటివ్ రైటర్.


