సల్మాన్ 'జయహో': అసద్ కు కౌంటర్

 

Salman Khan Asaduddin Owaisi, Salman Khan for praising Modi, Asaduddin slams Salman Khan

 

 

బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మీద ప్రశంసల జల్లు కురిపించి మద్దతు ప్రకటించడంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ సినిమాలను బహిష్కరించాలని తన మద్దతుదారులకు పిలునిచ్చారు. తాజాగా దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించారు. నరేంద్ర మోదీని కలవడాన్ని ఆయన సమర్ధించుకున్నారు.

 

జయహో చిత్రం ప్రోమోషన్ కోసం గుజరాత్ వెళ్లానని..పతంగులు ఎగురవేశానని చెప్పారు. తాను సగం హిందూ..సగం ముస్లీంనని అన్నారు. అలాగే తన తండ్రి ముస్లిం అని, తన తల్లి హిందువు అని చెప్పారు.గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు బాగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. ''జయహో'' మంచి మెసేజ్ వున్నా చిత్రమని అందరూ తప్పక చూడాలని అన్నారు.