TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సజ్జల సర్దేసుకుంటున్నారా: వైసీపీలో ఏం జరుగుతోంది.?

Published on: Wed Sep 23, 2026 4:52PM

స్థానిక ఎన్నికల ముంగిట వైసీపీలో అంతర్గత సంక్షోభం ముదిరి పాకాన పడిందా? అంటే పరిశీలకులే కాదు, విశ్లేషకులు సైతం ఔననే అంటున్నారు. ఇందుకు తార్కానంగా ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.

జగన్ అధికారంలో ఉన్న సమయంలో  ప్రభుత్వ ముఖ్య సలహాదారుగానే కాకుండా, సకల శాఖల మంత్రిగా ప్రభుత్వంలోనే కాకుండా, పార్టీలో కూడా చక్రం తిప్పి.. జగన్ కు కళ్లు, చెవులూ తానేనన్నట్లుగా వ్యవహరించిన సజ్జల ప్రభ 2024 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత మసకబారింది.  అన్నిటికీ మించి పార్టీ అధినేత జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన ప్రకటించే వరకూ కూడా సజ్జలకు తెలియని పరిస్థితి ఉందనీ, దీంతో తత్వం బోధపడిన సజ్జల తనంత తాను పార్టీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

విజయసాయిలా పార్టీకి వెంటనే గుడ్ బై చెప్పకుండా, విరామం పేరిట.. నెమ్మది నెమ్మదిగా క్రీయాశీల రాజకీయాల నుంచీ, పార్టీ వ్యవహారాల నుంచీ దూరం కావాలని యోచిస్గున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.  స్థానిక ఎన్నికలలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి సమష్టిగా పని చేయాల్సినతరుణంలో జగన్ కు కుడి భుజం లాంటి నేత మౌన ప్రేక్షకుడిగా మారి.. దాదాపు రాజకీయ సన్యాసం ప్రకటించినట్లుగా వ్యవహరించడం ఒకింద ఇబ్బందికర పరిణామమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.

 ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలనీ, స్థినిక ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ గట్టి పోటీ ఇవ్వాలనీ జగన్ పిలుపునిస్తుంటే.. మరో వైపు పార్టీనుంచి వరుసగా కీలక నేతల వలసలు పార్టీ వర్గాలలో ఆందోళన నింపుతున్నాయి. మొత్తం మీద వైసీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్గున్నారు.  


[Sajjala, Jagan, YCP key leader, Silince, Active Politics, AP Politics, TeluguOne news]