జవాన్ల కుటుంబాలకు సైనా కూడా విరాళం...
Published on: Sat Mar 18, 2017 12:21PM
.jpg)
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 12 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ 12 మంది జవానల్ల కుటుంబాలకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఒక్కో కుటుంబానికి 9 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పుడు అక్షయ్ లాగే సైనా కూడా జవాన్ల కుటుంబాలకు సహాయం చేసి ఉదారత చాటుకుంది. తన 27వ పుట్టినరోజు సందర్బంగా జవాన్ల కుటుంబాలకు రూ. 6 లక్షల విరాళాన్ని ప్రకటించింది. చనిపోయిన ఈ 12మంది జవాన్ల కుటుంబాలకు రూ. 50వేల చొప్పున విరాళాన్ని ఇస్తున్నట్లు సైనా ప్రకటించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... చత్తీస్‌గఢ్ ఘటనలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం నన్ను చాలా బాధించింది. మన రక్షణ కోసం వాళ్లు ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. చనిపోయిన వాళ్లను ఎలాగూ తిరిగి తీసుకురాలేం.. అందుకే, వాళ్ల కుటుంబాలకు నాకు చేతనైనంతగా ఈ ఆర్థికసాయాన్ని అందజేస్తున్నాను అని సైనా పేర్కొంది.


