తమ్ముడు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న డైరెక్టర్
Published on: Sun Mar 17, 2013 11:06AM

అడివి శేష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ 'కిస్'. ఈ సినిమాను సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలను వైజాగ్ లో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని గురించి ప్రొడ్యూసర్ సాయికిరణ్ అడివి మాట్లాడుతూ... మై బ్రదర్ శేష్ పంజా సినిమాలో చేసిన నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత అతనితో సినిమా చేయాలని అనుకున్నాను. ఒక రోజు శేష్ 'కిస్' మూవీ కథ తో నా దగ్గరికి వచ్చాడు. కథ కొత్తగా అనిపించడంతో... పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయడానికి మాకు రెండు నెలల సమయం పట్టింది.

ఈ సినిమాని షూటింగ్ మొదలు పెట్టె ముందు నేనే డైరెక్ట్ చేద్దామనే ఆలోచన వచ్చింది. కాని వేరే స్క్రిప్ట్ లో బిజీ గా వుండడం వల్ల చేయలేకపోయాను. కిస్ మూవీ చాలా బాగా వస్తోంది. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని నమ్ముతాను.. దీని గురించి చెప్పడం కంటే విడుదలైన తరువాత చితాన్ని చూసే ప్రతి ప్రేక్షకుడు మంచి సినిమాను చూసి ఎంజాయ్ చేశానన్న ఫీలింగ్ పొందుతారన్న నమ్మకం ఉంది. ఈ సమ్మర్ లో సినిమా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.


