Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న రాజా
posted on: Aug 3, 2014 6:45PM

శర్వానంద్ రన్ రాజా రన్ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టాడు. బాక్స్ ఆఫీస్ వద్ద రాజా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమా తొలి రోజు కంటే, శనివారం వసూళ్లు బాగున్నాయి. తొలివారం వసూళ్లు ఆరు నుంచి ఏడు కోట్లు వరకు రావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ ఊపురెండో వారం కూడా కొనసాగే అవకాశమే ఎక్కువగావుంది. సినిమాకు ఆరు కోట్ల వరకు ఖర్చయింది. దాంతో ఈ సినిమాకు లాభాలు ఎక్కువగా వస్తాయని నిర్మాతలు ఆశిస్తున్నారు. రాజా వల్ల అల్లుడు శీను కలెక్షన్ల జోరు తగ్గింది. బీసీ సెంటర్లలో అల్లుడి శీనుకి మంచి గిరాకీ ఉంది. ఏ సెంటర్లలో పూర్తిగా రన్ రాజా రన్ హవా చూపిస్తోంది.






