హోదాపై మాట్లాడేందుకు... రోజా హోదా ఏంటి?

రోజా... వైసీపీ వారి ఫ్రైర్ బ్రాండ్. ఆ పార్టీ ఎవర్ని తిట్టాలనుకున్నా ఈ రోజాస్త్రాన్నే ప్రయోగిస్తుంది. ఇక ఆమె మైకు పట్టుకుని మైకంలోకి వచ్చేసిందంటే తిట్లతో ఊగిపోతుంది! అఖరుకి తొలిసారి చట్ట సభలో కాలుపెట్టిన ఆమె స్పీకర్ సాక్షిగానే ముఖ్యమంత్రిని నానా బూతులు తిట్టి సంవత్సరం పాటూ అసెంబ్లోకి వెళ్లకుండా చేసుకుంది. అయితే, అందుకు రోజా సారీ చెప్పింది. కాకపోతే, ఎప్పుడు ప్రెస్ మీట్లలో  ప్రత్యర్థుల్ని దారుణంగా తిడుతూ చెలరేగే రోజా తాజాగా స్పెషల్ స్టేటస్ పై మాట్లాడింది! 


వైసీపీలో ప్రత్యేక హోదా లాంటి గంభీరమైన విషయం మాట్లాడటానికి సీనియారిటీ, సిన్సియారిటీ, సెన్సిబిలిటి వున్న ఎందరో నేతలున్నారు. మరీ ముఖ్యంగా, జగన్ కు ఎంతో సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా ఆర్దిక శాస్త్రం చదువుకున్న ఛార్టెడ్ అకౌంటెంటే! అలాంటి వారందర్నీ వదిలిపెట్టి రోజా చేత ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం ఏమిటి? మొదటి సారి ఎమ్మేల్యే అయిన ఆమెకు కనీసం రాజకీయ అనుభవం వుందని కూడా సరిపెట్టుకోలేని పరిస్థితి! 


గబ్బర్ సింగ్ కి రైమింగ్ వచ్చేలా రబ్బర్ సింగ్ అంటూ పవన్ టార్గెట్ చేసిన రోజా మరోసారి ఆయన్నే టార్గెట్ చేసింది. షూటింగ్ లు లేనప్పుడు పవన్ కళ్యాణ్ హోదా కోసం ఉద్యమిస్తాడని వెటకారంగా వ్యాఖ్యానించింది. అసలు ప్రజాప్రతినిధిగా వుంటూ జబర్డస్త్ జడ్జీగా కనిపించటాన్ని రోజా ఎలా సమర్థించుకుంటుంది. తాజాగా రోజా మరో ఛానల్లో మరో పంచాయితీలు తీర్చే షో కూడా ప్రారంభించింది. ఇలాంటి టీవీ షూటింగ్ ల నడుమ అప్పుడప్పుడూ తానొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అందర్నీ తిట్టిపోతే లేని తప్పు... పవన్ హోదా కోసం ఉద్యమిస్తే వచ్చిందా? రోజాకే తెలియాలి!

రోజా ఎప్పటిలాగే చేసిన హాట్ హాట్ , మాస్ మసాలా విమర్శల్ని పక్కనపెడితే ... వైసీపీ మొత్తంలో ఆమె ఒక్కతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం ఏంటి? ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్న పరిణామం ఇదే! జగన్ క్యాంప్ లో ఎందరో సీనియర్స్, మేధావులు వుండగా సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఫస్ట్ టైం ఎమ్మేల్యే రోజా స్పెషల్ స్టేటస్ పై స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టటం ఏంటని వారు ముక్కున వేలేసుకుంటున్నారు! 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu