TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కేజ్రీవాల్ పై రాబార్ట్ వాద్రా..నాతో నేరుగా మాట్లాడు..

Published on: Thu Mar 9, 2017 10:59AM


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మధ్య గొడవ జరుగుతుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే వాద్రా కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ''ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిక్షనరీలో ఎక్కువగా వినిపించే పేరు రాబర్ట్ వాద్రానే. 'వాద్రా వాళ్లను సజీవంగా తినేస్తాడు' లాంటి వ్యాఖ్యలు చూస్తే ఆయనకు నామీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లుంది. కావాలంటే ఢిల్లీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి, నాతో నేరుగా మాట్లాడాలని కోరుతున్నాను. నా మీద ఆయనకు ఏమైనా కోపం ఉంటే.. ప్రజలను నామీదకు ఎగదోయద్దు. ఢిల్లీ ముఖ్యమంత్రి అన్ని విషయాల్లో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను'' అని ఆ పోస్ట్‌లో రాశారు. మరి దీనిపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

కాగా ప్రధానమంత్రి రాబర్ట్ వాద్రా గురించి ఏమైనా మాట్లాడితే, ఆయనకు 56 అంగుళాల ఛాతీ ఉందని నేను నమ్ముతాను. వాద్రా ఆయనను సజీవంగా తినేస్తారు... అని ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.