TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

దేశ ప్రజలకు ఆర్బీఐ హోలీ కానుక...

Published on: Mon Mar 13, 2017 5:34PM

 

హోలీ పండుగు సందర్భంగా ఆర్బీఐ దేశ ప్రజలకు ఓ కానుకను తీసుకొచ్చింది. నగదు ఉపసంహరణలపై విధించిన అన్ని ఆంక్షలను రెండు దశల్లో తొలగించినట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ తెలిపారు. దీంతో ఏటీఎం విత్‌డ్రాలపై ఉన్న ఆంక్షలు మొత్తం తొలగిపోయినట్లైంది. ఈరోజు నుండి ఏటీఎంల్లో నగదు విత్‌డ్రాలపై నిబంధనలను తొలగించారు. ఇక ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ఏటీఎంల్లో నగదు సమస్య ఉన్నా త్వరలోనే తొలగిపోనుందని తెలిపారు.