TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రవితేజ 'సారోచ్చారు' టాక్

Published on: Fri Dec 21, 2012 3:17PM

 

ravi teja Sarocharu movie, sarocharu review talk, Sarocharu movie talk, Sarocharu  review reviews ratings

 

 

మాస్ మహారాజ రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ్ నటించిన "సారోచ్చారు" చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై౦ది. చాలా కాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకి ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చిందని అంటున్నారు. కాని రవితేజ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రం పర్వాలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ రోజు రిలీజైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఈ విషయం లో రవితేజ మాస్ అభిమానులను నిరుత్సాహపరిచాడని టాక్. సినిమా స్టొరీ బాగుంది కాని....డైరెక్టర్ పరశురామ్ స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది.



సినిమాలో క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొదటి బాగంలో రవితేజ, కాజల్ కెమిస్ట్రీ బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మొత్తం మీద ఈ సినిమాలో రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ను డైరెక్టర్ ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు.