ఆ ఛానెల్..ఆ పేపర్ నా వెంట్రుక : రామ్ చరణ్ ఫైర్
Published on: Tue Dec 18, 2012 10:06AM

‘నాయక్’ ఆడియో విడుదల వేదికపై మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ తేజ రెచ్చిపోయాడు. 'రచ్చ' ఆడియో ఫంక్షన్ కు బాబాయ్ పవన్ కళ్యాణ్ రాలేదని ఓ పత్రిక, ఓ ఛానల్ వార్తలు రాసి మా కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు పలు కథనాలు అల్లారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ కు బాబాయ్ వచ్చాడు. నాన్న రాలేకపోయాడు. ఈ వేదిక మీద నాన్న లేని లోటును బాబాయ్ తీర్చాడు. నా తరువాతి ఫంక్షన్ కు బాబాయ్ రాకపోవచ్చు. మా అనుబంధాల గురించి అడ్డగోలుగా రాసే ఆ పేపర్, ఛానల్ వార్తలు నా వెంట్రుకతో సమానం” రామ్ చరణ్ అన్నారు.
రామ్ చరణ్ వ్యాఖ్యలతో కార్యక్రమ ప్రాంగణం వేడెక్కింది. కార్యక్రమాలకు హాజరుకాకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంతమాత్రాన ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా ? అని ప్రశ్నించాడు.


