TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండిపెండెంట్ లను ఆదరిస్తున్న రామచంద్రాపురం

Published on: Fri May 25, 2012 1:54PM

42ఏళ్ల తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ ఎన్నికల ప్రస్థానంలో ముచ్చటగా మూడోసారి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఇది 16వ ఎన్నికలు. ఇప్పటికి 15సార్లు జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ, మూడుసార్లు తెలుగుదేశం పార్టీ, సిపిఐ, ప్రజాపార్టీ, కే ఎం పి.పి ఒక్కొక్కసారి, ఐదుసార్లు ఇండిపెండెంట్లు గెలుపొందారు.1967లో తొలి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నున్న వీర్రాజు ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు. మొదటి ఉప ఎన్నిక ఎమేల్యేగా గెలుపొందిన రాజగోపాలనర్సరాజు మరణం వల్ల నిర్వహించాల్సి వచ్చింది. 1953లో ఈ ఎన్నిక జరిగింది. దీని తరువాత 1970లోనూ ఉప ఎన్నికలు నిర్వహించారు. 2012లోనూ మూడో ఉప ఎన్నిక జరుగుతోంది.



ఈ సారి ఈ నియోజకవర్గం నుంచి త్రిముఖ పోటీ జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థి తోటత్రిమూర్తులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి, తాజామాజీ పిల్లి సుభాష్ చంద్రబోస్  ప్రధానంగా పోటీ పడుతున్నారు. వీరిలో సర్పంచి నుంచి మంత్రి దాకా ఎదిగిన చరిత్ర తాజామాజీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ది. 1982 నుంచి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల ద్వారా పైకి వచ్చిన నాయకుడు తోటత్రిమూర్తులు.  తాళ్లరేవు ఎమేల్యేగా ఐదుసార్లు విజయం సాధించినా రూపాయి సంపాదించుకోని చరిత్ర తెలుగుదేశం అభ్యర్థి చిక్కాల రామచంద్రరావుది. అందుకే చంద్రబాబు తన పర్యటనలో మచ్చలేని చిక్కాలను గెలిపించుకునే బాధ్యత రామచంద్రపురం నియోజకవర్గంపైనే ఉందన్నారు. తోట త్రిమూర్తులును గెలిపించుకోవాల్సిన బాధ్యత జిల్లా కాంగ్రెస్ పై ఉందని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ప్రజలలో మమేకమైన చరిత్ర బోస్ కుందని జగన్ కొనియాడారు. ఇలా ముగ్గురు అభ్యర్థులూ ముచ్చటగా మూడోసారి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.