TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాయక్ తో రచ్చరచ్చ చేయనున్న రామ్ చరణ్

Published on: Sat Jan 5, 2013 1:15PM

 

 Ram charan Nayak movie, Ram charan Nayak Release, Nayak release date, Nayak censor

 

 

రామ్ చరణ్ నాయక్ మూవీ ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సెన్సార్ నుంచి "ఏ" సర్టిఫికేట్ అందుకున్న నాయక్ సినిమా రిలీజ్ డేట్ ట్రైలర్లను విడుదల చేశారు. సినీ వర్గాలలో ఈ సినిమా టాక్ చాలా బాగుంది. నాయక్ మూవీ లో ఇంటర్వెల్ బ్లాక్ ఈ సినిమాకి హైలైట్ నిలుస్తుందని సమాచారం.

 

ఓ పక్కా మాస్ మూవీ ఏవేవి ఎక్కడేక్కేడ కుదరాలో, నాయక్ సినిమాలో అవన్ని కరెక్ట్ గా సమకురాయని ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు. రామ్ చరణ్  ఫైట్స్, డాన్సులు మెగా అభిమానులను కనువిందు చేస్తాయట. హిట్స్ లేక సతమతమవుతున్న వినాయక్ "నాయక్" తో తన రేంజ్ ఏంటో చూపిస్తాడని అంటున్నారు.


     
రామ్ చరణ్ నాయక్ తో రచ్చ కంటే పెద్ద హిట్ కొడతాడు, కాని "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" నుంచి ఎదురయ్యే పోటిని ఎంత వరకు తట్టుకోగాలడో వేచి చూడాలి..!