విజ‌య్‌కాంత్‌కు రాహుల్ శుభాకాంక్షలు

 

2014 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతుండటంతో రాహుల్‌కు ప‌ట్టాభిషేకం చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ర‌కాలుగా ఎత్తులు వేస్తుంది. వ‌చ్చిన ప్రతి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని రాహుల్ను ప్రదాని చేయ‌డానికి మార్గం సుగ‌మం చేసుకుంటుంది. అందులో భాగంగానే త‌మిళనాట మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ విజ‌య్‌కాంత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రాహుల్ గాంధీ స్వయంగా శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

2014 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎండీకే పార్టీ మధ్య పొత్తులు కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ డీఎండీకె పార్టీతో పొత్తుకు ప్రయ‌త్నిస్తుండ‌గా ఈ సంఘ‌ట‌న ఆ వాధ‌న‌కు మ‌రింత బ‌లానిచ్చింది. అయితే విజయ్ కాంత్ తో రాహుల్ మాట్లాడటం వెనుక ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు లేవని డీఎండీకే పార్టీకి చెందిన సీనియర్ నేత అన్నారు.  ప్రస్థుతానికి ఎవ‌రితో పొత్తుల గురించి ఆలోచ‌న లేద‌ని స‌రైన స‌మ‌యంలో దానికి సంబందించిన వివ‌రాలు వెల్లడిస్తామ‌న్నారు.