బేటీ బచావో నినాదానికి రాహుల్ కొత్త నిర్వచనం...

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై ఈ మధ్య తరచూ విమర్సలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి మోడీపై అయన కామెంట్లు గుప్పించారు. మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'బేటీ బచావో' నినాదానికి కొత్త నిర్వచనం చెప్పారు. 'ఆడపిల్లల్ని కాపాడండి... బీజేపీవాళ్ల నుంచి రక్షించండి' ఇదే తమ సరికొత్త నినాదమని అని  అన్నారు. అంతేకాదు.. పారిశుద్ధ్య పనులు వాల్మీకులకు ఆధ్యాత్మిక అనుభవంలాంటివని తన పుస్తకం 'కర్మయోగ్'లో మోదీ పేర్కొన్నారని... దళితులపై మోదీకి ఎంత చిన్న చూపు ఉందో దీంతో అర్థమవుతోందని మండిపడ్డారు. కీలకమైన పదవుల్లో ఆరెస్సెస్ కు చెందిన వ్యక్తులను పెడుతూ రాజ్యాంగబద్ధమైన సంస్థలను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని అన్నారు. 2019లో దేశ ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని చెప్పారు.