TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయలక్ష్మే కాదు... ధన లక్ష్మి కూడా!

Published on: Sat Aug 20, 2016 3:55PM


సింధు రియో ఒలంపిక్స్ లో పోటీపడి సిల్వర్ గెలిచింది. ఇప్పుడు ఆమెను సత్కరించే విషయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అంతకంటే ఎక్కువగా పోటీపడుతున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా, పక్కనే వున్న మద్యప్రదేశ్, ఎక్కడో వున్న ఢిల్లీ... ఇలా అన్ని సర్కార్లు సత్తా చాటుతున్నాయి. హైద్రాబాద్ లో ప్రాక్టీస్ చేసి ప్రపంచ స్థాయికి ఎదిగిన సింధుకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయల నజరాన ప్రకటించారు. అంతకంటే భేషుగ్గా... సింధు స్వంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించారు. చంద్రబాబు ఒలంపిక్ మెడల్ విన్నర్ కి ఏకంగా మూడు కోట్లు ప్రకటించారు. అంతే కాదు, గ్రూప్ వన్ స్థాయి జాబ్, ఆంధ్రుల రాజధాని అమరావతిలో వేయి గజాల స్థలం కూడా అనౌన్స్ చేశారు. ఆమె కోచ్ గోపిచంద్ కి కూడా ఏపీ గవర్నమెంట్ 50లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది!

 

చంద్రబాబు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ను ఎంకరేజ్ చేయటం ఇది మొదటిసారి కాదు. 2003లో గోపిచంద్ అకాడమి ప్రారంభించేందుకు గచ్చిబౌలిలో 5ఎకరాలు ఆయనే కేటాయించారు. ఆ అకాడమీలోనే సైనా, సింధు లాంటి మెరికలు తయారయ్యారు!

 

ఇక రియోలో రజతం గెలిచిన మన తెలుగు బంగారం సింధుకి ఇతర రాష్ట్రాలు కూడా వరుసగా నజరానాలు ప్రకటిస్తున్నాయి. మధ్యప్రధేశ్ ప్రభుత్వం 50లక్షలు అనౌన్స్ చేస్తే ఢిల్లీ సీఎం 2కోట్లు ఇస్తామని చెప్పారు! భారత బ్యాడ్మింటన్ సమాఖ్య కూడా సింధుకి 50లక్షలు, ఆమె కోచ్ గోపిచంద్ కి పది లక్షలు ప్రకటించింది...

 

మరి మెడల్ గెలిచిన వారిని ఎంకరేజ్ చేసే విషయంలో ఇంత పోటీపడుతోన్న ప్రభుత్వాలు, పొలిటీషన్స్.... మెడల్ గెలవాలని తాపత్రయపడుతోన్న ఔత్సాహికుల్ని ఎంకరేజ్ చేసే చర్యలు కూడా చేపడితే ఇంకా బావుంటుంది కదా...