TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై పురందేశ్వరి స్పందన.. విమర్శల వెల్లువ

Published on: Thu Aug 23, 2018 1:59PM

దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా, రాజకీయ నాయకురాలిగా తెలుగు ప్రజలకు సుపరిచితులు.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె కాంగ్రెస్, టీడీపీ పొత్తుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తును ఎన్టీఆర్ కుమార్తెగా వ్యతిరేకిస్తానని చెప్పారు.. అంతే కాదు ఈ పొత్తు గురించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఎలా స్పందిస్తారో చూడాలని అన్నారు.

 

 

అయితే పురందేశ్వరి వ్యాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. బీజేపీ నేతగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, టీడీపీల పొత్తుని వ్యతిరేకించటం తప్పు కాదు.. కానీ ఎన్టీఆర్ కుమార్తెగా వ్యతిరేస్తున్న అనటమే వివాదాస్పదమైంది.. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు, కాంగ్రెస్ ని తీవ్రంగా వ్యతిరేకించారు.. ఇది అందరికి తెలిసిన విషయమే.. మరి అదే కాంగ్రెస్ పార్టీలో పురందేశ్వరి చాలా ఏళ్ళు ఉన్నారు.. పదవులు కూడా అనుభవించారు.. అప్పుడు గుర్తుకురాని ఎన్టీఆర్, ఎన్టీఆర్ సిద్ధాంతాలు ఇప్పుడు బీజేపీలోకి వెళ్లేసరికి గుర్తుకువచ్చాయా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.