TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్ ది ఆదిమ సంస్కృతే.. ప్రియాంక చోప్రా

Published on: Wed Apr 27, 2016 6:12PM

 

అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అతని వ్యాఖ్యలపై ఇప్పుడు బాలీవుడ్ నటి స్పందిస్తూ విమర్శనాస్తాలు సంధించింది. గతంలో అమెరికాలోకి ముస్లింల‌ను రానివ్వ‌కుండా నిషేధం విధించాల‌ని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక చోప్రా.. ఇటువంటి చ‌ర్య ఆదిమ సంస్కృతేనంటూ.. క్లిష్ట‌మైన ఉగ్ర‌వాద నిర్మూల‌నా అంశాన్ని ఓ వ‌ర్గానికి ఆపాదిస్తూ వారిపై నిషేధం విధించ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను తిప్పి కొట్టింది.

 

కాగా ప్రస్తుతం ప్రియాంక చోప్రా.. అమెరిక‌న్ టీవీ సీరియ‌ల్‌ ‘క్వాంటికో’ షూటింగ్‌లో బిజీబిజీగా ఉంది. మరోపక్క హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్‌’ సినిమాలో నటించే అవకాశం సైతం కొట్టేసింది.