TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోదుస్తులు కనిపించేలా ప్రియాంక డ్రస్.. ఢిల్లీలో హాట్ టాపిక్

Published on: Thu May 8, 2014 12:39PM

 

 

 

సెలబ్రిటీలు ఏం చేసినా సంచలనం అవుతుంది. ఏం చేయకపోయినా సంచలనం అవుతుంది. నలుగురి దృష్టీ పడే సెలబ్రిటీలు కాస్తంత జాగ్రత్తగా వుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు అంతటా వున్నాయి. సెలబ్రిటీలు.. ముఖ్యంగా లేడీ సెలబ్రిటీలు బయటకి వెళ్తే లక్షలాది కళ్ళు వాళ్ళని తడిమేస్తాయి. ఆ చూపులకు దొరికిపోతే లేనిపోని వివాదాలు తలెత్తుతాయి.

 

బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇలాంటి వివాదంలోనే ఇరుక్కుంది. ప్రియాంక చోప్రా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంది. ‘ఐ కాంట్ మేక్ యూ లవ్ మీ’ అనే మ్యూజిక్ ఆవిష్కరణ కార్యక్రమం అది. ప్రియాంకా చోప్రా ఆ కార్యక్రమానికి మామూలు డ్రస్‌లో వచ్చి వెళ్తే ఎలాంటి ఇబ్బందీ వుండేది కాదు. అయితే ప్రియాంక పైన సగం టీషర్టు, కింద ఒక స్కర్టు వేసుకుని వచ్చింది. ఇది కూడా పెద్ద సమస్య కాదు. అయితే సదరు స్కర్టు ఒక జల్లెడ లాంటి క్లాత్‌తో కుట్టిన స్కర్ట్. సదరు స్కర్ట్ ని చూస్తుంటే ప్రియాక చోప్రా వేసుకున్న లో దుస్తులు కూడా కనిపిస్తున్నాయి.



ఈ స్కర్ట్ వేసుకున్న ప్రియాంక ఆ ఫంక్షన్‌లో ఉత్సాహంగా గంతులు వేస్తే అందరూ కళ్ళు తెరుచుకుని చూశారు. అయితే ఆ తర్వాతే విమర్శకులు తమ నోళ్ళకి పదును పెట్టారు. ప్రియాంక చోప్రా కాస్తంత సెక్సీగా వుండే డ్రస్ వేసుకొస్తే పర్లేదుగానీ, మరీ లో దుస్తులు కనిపించే డ్రస్ వేసుకు రావడం భావ్యంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీ సెలబ్రిటీ వరల్డ్ లో ప్రియాంక వేసుకొచ్చిన డ్రస్సే హాట్ టాపిక్‌గా మారింది.