TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ విజయం

Published on: Sun Jul 22, 2012 4:48PM

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ విజయం సాధించారు. గెలుపుకు కావలిసిన ఓట్ల విలువను దాటిన ప్రణబ్, గెలుపుకు కావలసిన ఓట్ల విలువ 5 లక్షల 18వేలు కాగా, ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ 5 లక్షల 58 వేలు దాటి భారీ మెజారిటీతో విజయం సాధించానున్నారు. కాగా ప్రణబ్ గెలుపు లాంచనమే కావడంతో ఆయన నివాసం ఉన్న రహదారిలో కోలాహలం నెలకొంది. ఆయన ఇప్పుడున్న నివాసం వదిలి రాష్ట్రపతి భవనంకు మకాం మార్చనున్నారు. ప్రణబ్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు భారీగా కాంగ్రెసు నేతలు తరలి వస్తున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా రానున్నారని తెలుస్తోంది. ఆయన 25న పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారం చేస్తారు.

 

రాష్ట్రాల వారిగా ఓట్లు:

ఏపీ ఎమ్మెల్యేల ఓట్లలో ప్రణబ్‌కు 182, సంగ్మాకు 3, చెల్లని ఓట్లు 5
అరుణాచల్‌ ప్రదేశ్‌ ఓట్లలో ప్రణబ్‌కు 54, సంగ్మాకు 2, చెల్లని ఓట్లు 3
అసోం ఓట్లలో ప్రణబ్‌కు 110, సంగ్మా 13, చెల్లని ఓట్లు 2
బీహార్‌ ఓట్లలో ప్రణబ్‌కు 146, సంగ్మా 90
జార్ఖండ్‌లో ప్రణబ్-60, సంగ్మా-20 ఓట్లు
జమ్మూకాశ్మీర్‌లో ప్రణబ్-68, సంగ్మా-15 ఓట్లు
హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రణబ్-23, సంగ్మా-44 ఓట్లు
హర్యానాలో ప్రణబ్-53, సంగ్మా-29 ఓట్లు
ఛత్తీస్‌గఢ్‌ ఓట్లలో ప్రణబ్‌కు 39, సంగ్మాకు 50, చెల్లని ఓట్లు 1

బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌లో సంగ్మాకు ఆధిక్యం లభించింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో క్రాస్ ఓటింగ్‌ నమోదైంది.

కర్ణాటకలో ప్రణబ్‌కు 117, సంగ్మాకు 103
మధ్యప్రదేశ్‌లో ప్రణబ్-73, సంగ్మా-156 ఓట్లు
గోవా ఓట్లలో ప్రణబ్‌కు 9, సంగ్మాకు 31, చెల్లని ఓట్లు 1
గుజరాత్‌లో ప్రణబ్-59, సంగ్మా-123 ఓట్లు