TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'ఆరడుగుల బుల్లెట్' పవన్ బర్త్ డే

Published on: Mon Sep 2, 2013 12:53PM

 

power star birthday, Pawan Kalyan birthday, Pawan Kalyan, pawan birthday, happy birthday pawan kalyan

 

 

 

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా... హీరోగా టాలీవుడ్ కి పరిచయమై గోకులంతో సీత, సుస్వాగతం వంటి విభిన్న కథాచిత్రాల్లో నటించి మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుని.... 'తొలి ప్రేమ'తో లవ్ స్టోరీస్ లో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి 'తమ్ముడు'తో అన్నకు తగ్గ తమ్ముడుగా అద్భుత విజయాన్ని సాధించి 'బద్రి'తో తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకుని 'ఖుషి'తో రికార్డులు బ్రేక్ చేసి అందరూ తన స్టైల్ ని ఫాలో అయ్యే రేంజికి ఎదిగి జానితో దర్శకుడుగా పరిచయమై గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం చిత్రాలతో ఓపెనింగ్స్ క్రియేట్ చేసి జల్సాతో బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసి కొమరం పులి, తీన్ మార్, పంజా చిత్రాల తర్వాత గబ్బర్ సింగ్ తో మళ్ళీ తన పవర్ ఏమిటో చూపించి కలెక్షన్ల వర్షం కురిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు 'అత్తారింటికి దారేది' తో మరోసారి సరికొత్త రికార్డు సృష్టించడానికి వస్తున్నాడు.


సెప్టెంబర్ 2తో 42వ వసంతంలోకి అడుగు పెడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి తెలుగు వన్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.