రాజకీయాలకు పోసాని గుడ్ బై
Published on: Thu Nov 21, 2024 8:28PM
ప్రముఖ సినీ రచయిత,వైకాపా నేత పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. కుటుంబ కారణాల రీత్యా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు.
వైకాపాలో తనకు కనీసం సభ్యత్వం కూడా లేదని పోసాని చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోసాని నోరు అదుపులో పెట్టుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తాజాగా పోసాని తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. తాను వైకాపా నుంచి వైదొలగినంత మాత్రాన ప్రజా సేవ ఆపేది లేదన్నారు. జగన్ కు క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు.


