సుప్రీంలో పొన్నాలకు చుక్కెదురు, పదివేల జరిమానా
Published on: Fri Jul 6, 2012 11:20AM
మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. తన ఎన్నికపై హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలంటూ పొన్నాల దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. పొన్నాల ఎన్నికపై రీకౌంటింగ్ జరపాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. అంతే కాకుండా మంత్రికి పదివేల రూపాలయల జరిమానా విధించింది. 2009 ఎన్నికల్లో జనగాం నుండి 236 ఓట్ల తేడాతో టిఆర్‌ఎస్ అభ్యర్ధి కె. ప్రతాప్‌రెడ్డిపై పొన్నాల విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో అక్రమాలు జరిగాయని, ఓడిన పొన్నాలను గెలుపొందినట్లు ప్రకటించారని నాటి నుండి టిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఇదే వాదనతో టిఆర్‌ఎస్ అభ్యర్ధి హైకోర్టును ఆశ్రయించగా, పొన్నాల ఎన్నికపై 2010లో కోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ తీర్పును పొన్నాల సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.


