రాజకీయ నేతల ఘనకార్యాలు ఇవే..

 

ఏమైందో ఏమో తెలియదు కాని ఈ మధ్య కాలంలో రాజకీయ నేతలు వరసపెట్టి ఒకరి తరువాత ఒకరు అడ్డంగా బుక్కవుతున్నారు. ఆవేశంగా అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం.. ఆఖరికి అందరూ చివాట్లు పెడుతుంటే క్షమాపణలు చెప్పడం. గత కొద్ది రోజులుగా ఇదే సరిపోతుంది. ఎవరెవరు ఎంత బాగా బుక్కయ్యారో ఓ లుక్కేద్దాం..

దయాకర్ సింగ్

 

 

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న దయాశంకర్ సింగ్ బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ) అధినేత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆమెను ఒక వేశ్యతో పోల్చుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..  'డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుంది. మాయవతి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. ఇక దీనిపై రేగిన దుమారం అంతా ఇంతా కాదు. ఆఖరికి దయాశంకర్ సింగ్ క్షమాపణలు చెప్పినా.. పదవి నుండి సస్పెండ్ చేసినా బీఎస్పీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఆయన దిష్టి దొమ్మలు తగలపెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త నెమ్మదిస్తుంది.


 టున్నా జై పాండే

 

 

బీజేపీ ఎమ్మెల్సీ టున్నా జై పాండే.. ఈయన గారు కూడా ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. బీహార్ బీజేపీ ఎమ్మెల్సీ టున్నా జై పాండే పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ లో హౌరా నుంచి గోరఖ్ పూర్ వెళుతున్నారు. ఈ క్రమంలో అతను ప్రయాణిస్తున్న బోగీలో.. అతని బెర్త్ కు సమీపంలో ఓ 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. అయితే రాత్రి సమయంలో ఆయన ఆ బాలిక బెర్త్ దగ్గరకి వెళ్లి ఆమెను ముద్దుపెట్టుకొని.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన బాలిక రైలు చైను లాగి.. తన తల్లి దండ్రులను పిలచి జరిగింది చెప్పడంతో అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు.  కాగా ఎమ్మెల్సీ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, దిగే స్టేషన్ దగ్గరగా రావడంతో... మొబైల్ ఛార్జర్ ప్లగ్ తీయడానికే బాలిక బెర్తు దగ్గరికి వెళ్లానని చెప్పుకొచ్చారు.

 శ్యాం బహదూర్ సింగ్

 

 

జేడీయూ ఎమ్మెల్యే శ్యాం బహదూర్ సింగ్ డ్యాన్సింగ్ గర్స్త్ తో డ్యాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. అది కూడా అభ్యంతరకరమైన పరిస్థితుల్లో. అయితే ఈ ఘటన గత ఏడాది చోటుచేసుకోగా.. గత కొద్ది రోజుల క్రిందట ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా తిరునాళ్లలో, జాతరల్లో నిర్వహించే అభ్యంతరకర నృత్యాలు దాదాపుగా బ్యాన్ అయిన విషయం తెలిసిందే. అలాంటిది వాటిని ఖండించాల్సిన నేతనే ఇలాంటి పనలు చేస్తున్నారంటూ అందరూ తిట్టి పోశారు.

భగవత్ మాన్‌సింగ్

 

 

ఆప్ ఎంపీ భగవత్ మాన్‌సింగ్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. ఈయన ఏకంగా పార్లమెంట్ భద్రత సిస్టమ్ నే షూట్ చేశారు. చేస్తే చేశారు.. అక్కడితో ఆగకుండా ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇక ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఆని ఎదురుచూసే విపక్షాలు ఊరుకుంటాయా.. ఆయన చేసిన పనిపై మండిపడుతున్నారు. ప్రజాసామ్యానికి టెంపుల్ లాంటి పార్లమెంట్ భద్రతపై స్టింగ్ ఆపరేషన్ చేయడమేంటని.. పార్లమెంట్ భద్రత వ్యవహారాన్ని వీడియోలు తీయడం దారుణమని.. ఇది భద్రత నియమాలను ఉల్లంఘించడమే కాదు, సభ్యుల హక్కుల ఉల్లంఘన కిందకు కూడా వస్తుందని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బుక్కయిన తరువాత అందరూ చెప్పినట్టే క్షమాపణలు చెప్పాడు.

బహదూర్ సింగ్ కోలీ

 

 

ఇప్పుడు తాజాగా మరో బీజేపీ ఎంపీ వివాదంలో చిక్కుకున్నారు. తన వాహనాన్ని అడ్డుకున్నందుకు టోల్ గేట్ ఉద్యోగిని.. ఎంపీ అనుచరులు చితకొట్టారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ బీజేపీ ఎంపీ బహదూర్ సింగ్ కోలీ తన నియోజక వర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో భరత్ పూర్ లోని టోల్ గేట్ వద్ద రుసుం చెల్లించకుండా ఆయన వాహనం వెళుతుండగా, అక్కడి ఉద్యోగి ఆ వాహనాన్ని ఆపాడు. దీంతో సదరు ఎంపీ గారి అనుచరులు రెచ్చిపోయి ఉద్యోగిని కొట్టారు. అయితే అది కాస్త సీక్రెట్ కెమెరాల ద్వారా రికార్డయింది. దీంతో ఆ వీడియో బయటకు రావడంతో ఎంపీ గారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిని ఎంపీ గారు ఏ విధంగా కవర్ చేసుకుంటారో చూద్దాం..


మొత్తానికి పలు పార్టీలకు చెందిన పలు నేతలు ఆవేశంగా తమకు ఇష్టమొచ్చినట్టు వ్యవహిరించి తమకే కాదు.. తమ పార్టీలకు కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు. మరి ఇంకా ఎంతమంది బుక్కవుతారో.. ఎంత మంది అధికార దుర్వినియోగానికి పాల్పడతారో చూద్దాం..