TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్కూల్ పిల్లలపై విష ప్రయోగం.. ఎక్కడంటే?

Published on: Wed Apr 16, 2025 2:28PM

ఆదిలాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులపై  వి ప్రయోగం జరిగింది. ఇచ్చోడ మండలం ధరంపురి ఎంపీపీ స్కూల్లో విద్యార్ధులు వినియోగించే నీటిలో వంట సామాగ్రిపై గుర్తు తెలియని దుండుగులు పురుగుల మందు చల్లారు. విషప్రయోగం అనంతరం దుండుగులు పురుగుల మందు డబ్బాను అక్కడే పడేశారు. దీనిని ప్రధానోపాధ్యయుడు ముందే గుర్తించడంతో 30 మంది విద్యార్ధులకు పెను ప్రమాదం తప్పింది. ఘటనపై స్కూల్ హెచ్‌ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు.శనివారం, ఆది వారం సెలవు  కావడంతో స్కూల్లోని వంట గదికి సిబ్బంది తాళం వేసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం స్కూలుకు వచ్చిన సిబ్బంది మధ్యాహ్న భోజనం కోసం వంట ఏర్పాట్లు ప్రారంభించారు. 

పాత్రలను క్లీన్ చేసే సమయంలో నీటి నుంచి నురగలు, దుర్వాసన రావడంతో అప్రమత్తమయ్యారు. చుట్టు పక్కల పరిశీలించగా.. వాటర్ ట్యాంక్ సమీపంలో పురుగుల మందు డబ్బా కనిపించిందని సిబ్బం ది చెప్పారు. తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు తాగు నీటి కుళాయిల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం వండలేదు.

ఈ ఘటనతో స్కూలుతో పాటు గ్రామంలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్కూలు హెడ్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వాటర్ ట్యాంక్ లో పురుగుమందు కలిపిన దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.