అజిత్ పవార్ అంత్యక్రియలకు ప్రధాని మోడీ, అమిత్ షా
Published on: Thu Jan 29, 2026 7:54AM
.webp)
మహారాష్ట్ర సీనియర్ నేత అజిత్ పవార్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం బారామతిలో గురువారం (జనవరి 29( జరగనున్నాయి. బుధవారం (జనవరి 28) జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్‌కు తుది వీడ్కోలు పలికేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు బారామతికి చేరుకుంటున్నారు.
బుధవారం (జనవరి 28) ఉదయం బారామతి లో టేబుల్‌టాప్ రన్‌వేకు కేవలం 200 మీటర్ల దూరంలో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


