మళ్ళీ పవన్, రమణ గోగుల కాంబినేషన్...?
Published on: Sat Mar 16, 2013 10:06AM
.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల కాంబినేషన్ ఎలాంటి హిట్స్ అందించిందో అందరికీ తెలిసిందే...! “తమ్ముడు”, “బద్రి” బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. “జానీ” సినిమా ఫ్లాప్ అయినా.... ఆడియో మాత్రం అలరించింది. “అన్నవరం” నిరాశనే మిగిల్చడంతో.... క్రమంగా రమణగోగుల తన ప్రభావాన్ని కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ సందడి చేస్తోందన్న వార్తలు ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రానికి రమణ గోగుల స్వరాలు సమకూర్చనున్నారట. సో... ఈసారి మరింత ఎనర్జీ పుంజుకుని వస్తున్న ఈ కాంబినేషన్ మెగా ఫ్యాన్స్ ను ఏమేరకు ఉర్రూతలూగిస్తుందో... వేచి చూడాలి..


