TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అత్తాపూర్ బాబాగా పవన్ కళ్యాణ్

Published on: Thu Jul 11, 2013 8:02PM

 

Pawan kalyan New Look, Pawan kalyan as attapur baba

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త గెటప్ ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అత్తారింటికి దారేది ’ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘అత్తాపూర్ బాబా’ అవతారంలో కనిపించబోతున్నాడట. ఈ అవతారంతో పవన్ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాడని అంటున్నారు. దీనికి సంబందించిన ఓ ఫోటో నెట్లో హల్ చేస్తూ జనాల్లో క్రేజ్ ని సంపాదించుకుంటుంది. పవన్ కి తోడు కామెడీ సీన్ ను మరింత పండించడానికి బ్రహ్మానందం, అలీలు కూడా ఆయనతో జత కలవనున్నారని, ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. ఈ సన్నివేశం చిత్రానికి మరింత హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫేమస్ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ఇది.