TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళలకు పవన్ శుభాకాంక్షలు... ఆ మాటలు నిజం చేద్దాం..

Published on: Wed Mar 8, 2017 10:36AM


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ దేవతలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని.. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్ర్యం వస్తుందన్న బాపు మాటలను నిజం చేద్దామని ఆయన కోరారు. భ్రూణ హత్యలను అరికట్టి ఆడబిడ్డలను సంరక్షించుకున్నప్పుడే భారత జాతి సుసంపన్నంగా శోభిల్లుతుందని పవన్ వెల్లడించారు.

 

కాగా పవన్ కళ్యాణ్ ఈ మధ్య సమాజంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనే సమస్య ఉన్న ప్రాంతానికి స్వయంగా వెళ్లడం.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ వినతులను స్పందించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.