పవన్ కళ్యాణ్ కు భయపడలేదు: దిల్ రాజు
posted on Jul 29, 2013 10:27AM

రామ్ చరణ్ కొత్త సినిమా ‘ఎవడు’ను పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’కి భయపడి వాయిదా వేయలేదని నిర్మాత దిల్ రాజు చెప్పాడు. ఈ నెల 31న విడుదల కావాల్సిన ఈ సినిమా మూడు వారాలు వాయిదా వేసి ఆగస్టు 21న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’ ఆగస్టు 7న విడుదలవుతున్న నేపథ్యంలోనే ‘ఎవడు’ను వాయిదా వేశారని వార్తలొచ్చిన నేపథ్యంలో దిల్ రాజు స్పందించాడు. ‘‘పవన్ కు భయపడే రామ్ చరణ్ వెనక్కి తగ్గాడు అనడం సరికాదు. కళ్యాణ్ బాబాయ్. చరణ్ అబ్బాయ్. బాబాయిని అబ్బాయి గౌరవిస్తాడు కానీ భయపడడు. నాకు తెలిసీ అత్తారింటికి దారేది, ఎవడు సినిమాలు రెండూ పెద్ద హిట్టయ్యేవే. ఏ సినిమా అయినా తెరపై చూస్తేనే సత్తా ఏమిటో తెలుస్తుంది’’ దిల్ రాజు అన్నాడు.
పవన్ కళ్యాణ్, చరణ్ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నాకే ‘ఎవడు’ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారని దిల్ రాజు చెప్పాడు.