పవన్ రాజకీయమంతా 'గోదాట్లోనేనా'?

 

ఆంధ్రా పాలిటిక్స్ త్వరలో కంప్లీట్ గా ఛేంజ్ అవ్వనున్నాయా? పరిస్థితి చూస్తుంటే అలానే వుంది. 2014లో ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరిగాయి. అయినా కూడా తెలంగాణ, ఆంద్రా వేరు వేరు రాష్ట్రాలుగానే స్పందించాయి. అప్పటికే పార్లమెంట్లో బిల్లు పాసైపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఏపీ ప్రజలు టీడీపీ అన్నారు. తెలంగాణ వాళ్లు టీఆర్ఎస్ అన్నారు. కాని, 2019 ఎన్నికలు మొత్తం భిన్నంగా వుండేలా కనిపిస్తున్నాయి. అందుక్కారణం... పవర్ స్టార్ పవన్ కళ్యాణే!
తెలంగాణలో టీఆర్ఎస్ కి ఇప్పుడు తిరుగులేదు. ఓ రీసెంట్ సర్వేలోనైతే వెంటనే ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీదే క్లీన్ స్వీప్ అని తేలిపోయింది! కాని, సమస్యంతా ఆంధ్రాలోనే వుంది. ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపిలు కాక వైసీపీ మాత్రమే వుంది. జస్ట్ మూడు పార్టీలే ప్లోర్ పై రాజకీయం చే్స్తున్నాయి. అందులోనూ గోలంతా టీడీపీ, వైసీపీల మధ్యే. ఆరోపణలు, ప్రత్యారోపణలు, మైక్ లు విరిచేయటాలు, బూతులు తిట్టుకోవటాలు అన్నీ సైకిల్ కి, ఫ్యాన్ కి మధ్యలోనే! కాని, పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయం 2019 ఆంధ్రా అసెంబ్లీ రూపు రేఖల్ని మార్చేసేలా వుంది!

 

 

ఇంత కాలం ప్రశ్నిస్తా అంటూ అప్పుడప్పుడూ ప్రత్యక్షం అయిన పవన్ ... ఓ ప్రెస్ మీటో, బహిరంగ సభో పెట్టేవాడు. మీడియాలో నానా హడావిడి అయ్యాక అమాంతం మాయం అయ్యే వాడు. ఆయన మీద ఆరోపణ కూడా అదే. పాలిటిక్స్ లో సీరియస్ గా ఇన్వాల్వ్ అవ్వటం లేదని క్రిటిక్స్ గోల చేసేవారు. కాని, ఇప్పుడు పవన్ ఏలూరులో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అది వాళ్ల స్వంత జిల్లా ముఖ్య కేంద్రం కాబట్టి అక్కడే ఓ ఇల్లు కూడా తీసుకోవాలని పవన్ నిశ్చయించుకున్నాడు. అంటే, దాదాపూ 2019 ఎన్నికల్లో ఆయన అక్కడ్నుంచీ పోటీ చేయటం ఖరారైపోయినట్టే! ఇదే ఇప్పడు ఏపీ పొలిటికల్ ఫేస్ మార్చేసే పరిణామం!
జనసేన అధినేత ఎమ్మేల్యేగా అసెంబ్లీలో కాలుపెడితే ఆయన వెంట భారీగానే ఎమ్మేల్యేలు వచ్చే అవకాశం వుంది. పవన్ తన స్వంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? లేదా? అనేది ఇప్పుడు చెప్పగలిగేది కాదు. అంత వీక్ గా టీడీపీ లేదు. వైసీపీ కూడా పవన్ ప్రభంజనానికి కొట్టుకుపోయే స్థితిలో ఏం లేదు. అయినా పవన్ ప్రభావం అస్సలు వుండదని కూడా చెప్పే వీలు లేని పరిస్థితి వుంది! అంటే... వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో పాటూ జనసేన సీట్లు షేర్ చేసుకోనుందన్నమాట. దాంతో హంగ్ కూడా అనివార్యం కావొచ్చు!

 

పవన్ తీసుకున్న ఏలూరు నిర్ణయం... రానున్న రోజుల్లో ఆయన్ని కింగ్ ను చేయోచ్చు. లేదంటే కింగ్ మేకర్ ను చేయోచ్చు. ఏది ఏమైనా, ఆంద్రా పాలిటిక్స్ ని మాత్రం గబ్బర్ సింగ్ ఎంట్రీ ఖచ్చితంగా రక్తి కట్టిస్తుంది! లెట్స్ అండ్ వెయిట్ సీ...