TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెండు రోజుల ఏసీబీ కస్టడీకి పట్టాభిరామారావు

Published on: Fri Jun 29, 2012 12:25PM

 బెయిల్ ఫర్ సేల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన మాజీ జడ్జి పట్టాభిరామారావును రెండు రోజుల ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం ఉద యం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులు, న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగనుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పట్టాభిని ఏసీబీ ప్రశ్నించనుంది.  గాలి బెయిల్ వ్యవహారంలో పట్టాభి రామారావునే అంతిమ లబ్ధిదారని ఏసీబీ కోర్టుకు తెలిపింది. పట్టాబి రామారావుతో సంప్రదింపులు జరిపింది ఎవరో తేలాలంటే కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోర్టును కోరింది. ఇప్పటికే ఈ కేసులో పట్టాభి కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్‌ జడ్జి చలపతిరావులను కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. కాగా పట్టాభి రామారావును విచారించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం జైలుకు తరలించాలని కోర్టు ఏసీబీని ఆదేశించింది.