పాతబస్తీలో ఉద్రికత వాతావరణం, టెన్షన్..టెన్షన్ !
Published on: Fri Jan 11, 2013 2:15PM

హైదరాబాద్ పాతబస్తీలో శుక్రవారం ఉద్రికత వాతావరణం నెలకొంది. మక్కా మసీదులో ప్రార్ధనల అన౦తరం ఆందోళనకారులు రెచ్చిపోయారు. చార్మినార్ వద్ద భారిగా మోహరించిన పోలీసుల పై రాళ్ళురువ్వారు. దీంతో పోలీసులు ఆందోళన కారులు పై లాఠీఛార్జ్ చేసి బాష్ప వాయువును ప్రయోగించారు. ఈ దాడిలో కొంత మంది మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు.
అయితే కొంతమంది అక్బరుద్దీన్ కు అనుకూలంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తూ చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్బరుద్దీన్ ను వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఈ అందోళనల వెనుక ఎంఐఎం హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సిసి టివీ కెమెరాల ద్వారా ఆందోళన కారులను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.


