TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రెండో విడత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం...

Published on: Thu Mar 9, 2017 11:35AM

 

ఈరోజు రెండో విడత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా  ఇటీవల కన్నుమూసిన మాజీ కేంద్రమంత్రి పి.శివశంకర్‌కు ఉభయసభలు సంతాపం తెలిపాయి.  మాతృత్వ సెలవులను ప్రస్తుతమున్న 12 వారాల నుంచి 26 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన ‘మాతృత్వ ప్రయోజన(సవరణ) బిల్లు-2016’ను కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా ప్రధాని సహా అధికార, విపక్ష పార్టీల సభ్యులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.