పాక్ గెలిచింది! ‘కొందరు’ ఇండియన్స్ సంతోషించారు! ‘వాళ్లే’ అసలు డేంజర్!

 

సినిమాని సినిమాలానే చూడాలి! ఆటను ఆటలానే ఆడాలి! ఈ డైలాగ్స్ చెప్పినంత తేలిక కాదు ఆచరించటం! ఎందుకంటే, సినిమాను మన దగ్గర బొమ్మల గారడీగా చూడరు. రియల్ లైఫ్ లా ఫీలవుతారు. అందుకే, సినిమా హీరోలు మన దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు అయ్యారు. అవుతున్నారు. ఇక సినిమా తరువాత ఆ రేంజ్లో, అంతకంటే ఎక్కువ క్రేజ్ వున్నది కిక్రెట్ కి. ఇండియాలో క్రికెట్ గేమ్ కాదు… మతం అనటం మనకు తెలిసిందే! అందులో ఒప్పుకోకపోవటానికి ఏం లేదు. నిజంగానే క్రికెటొక మతం… క్రికెటర్ల దేవుళ్లు! కాని, సమస్యల్లా మతంలోంచి మతోన్మాదం పుట్టడమే!

 

క్రికెట్ మతమైతే ఫర్వాలేదు. కాని, క్రికెట్ తో అసలు సిసలు మతాలు ముడిపడితే? అప్పుడు క్రికెట్ మ్యాచ్ లు యుద్ధాలైపోతాయి. టీవీలు బద్ధలైపోతాయి. పాకిస్తాన్ లో వుండేంత పిచ్చి, ఉన్మాదం మన దగ్గర వుండకపోవచ్చు. కాని, ఇండియన్స్ కూడా పాక్ తో క్రికెట్ అనగానే తొడలు కొట్టి , జబ్బలు చరిచి టీవీల ముందు కూర్చుంటారు. గెలిస్తే టపాసులు పేలుతాయి. కాని, పాక్ చేతిలో భారత్ ఓడితే? అటు క్రికెట్ లవర్స్, ఇటు దేశభక్తులు… ఇద్దరి గుండెలూ టపాసుల్లానే పేలతాయి. చెప్పలేని, చెప్పుకోలేని బాధ నిలువునా దహించేస్తుంది! కాని, అసలు ఈ క్రికెటోన్మాదానికి కారణం ఏంటి?

 

ఇండియాలో మన కిక్రెట్ టీమ్ పాకీల చేతిలో ఓడిపోతే బాధ, అవమానం మాత్రమే వుంటాయి. కాని, పాకిస్తాన్లో తమ ప్లేయర్లు ఇండియా చేతిలో ఓడితే ఉక్రోశం, ఉన్మాదం, పైశాచికత్వం స్వైర విహారం చేస్తాయి. ఇండియా చేతిలో పాక్ ఓడినందుకు టీవీలు పగలగొట్టిన వారి దగ్గర నుంచీ పిల్లల్ని చంపుకున్న వారి దాకా అనేక రకాల క్రికెట్ ఉన్మాదులు వున్నారు పక్క దేశంలో! దీనికంతటికీ కారణం క్రికెట్ అనే మతానికి అసలు మతాలు జోడీ కావటమే. ప్రధానంగా పాకిస్తానీలు ఇండియాను , ఇండియన్ టీమ్ ను హిందూ సైన్యంగా చూస్తారు. అందుకే, వారికి ఓడిన ప్రతీసారీ రక్తం మరిగిపోతుంది. ఇక కాశ్మీర్ సమస్య వుండనే వుంది. దాని వల్ల మూడుసార్లు యుద్ధాలు చేసుకోవాల్సి వచ్చింది ఇండియా, పాక్. ఆ యుద్ధాల్లోలాగే పదే పదే పాక్ ఓడుతూ వస్తోంది క్రికెట్లోనూ! అందుకే, ఆదివారం నాటి ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ లాగా ఎప్పుడైనా తమ దేశం గిలిస్తే పాకిస్తానీల ఆవేశానికి, అరాచకాలకి హద్దే వుండదు! కాశ్మీర్ తో సహా భారత్ మొత్తం తమ వశమైపోయినట్టు ఊగిపోతారు మీడియాలో, సోషల్ మీడియాల్లో!

 

ఇండియాను ఓడించిన పాక్ టీమ్ ను చూసి పాకిస్తానీలు చెలరేగటం… అర్థం చేసుకోవచ్చు. కాని, మన దేశంలో వుంటూ లోలోపల పాకిస్తాన్ గెలవాలని కోరుకునే నక్కలతోని చాలా పెద్ద ప్రమాదం వుంది. ఇంకా బోలెడు మంది పాకిస్తాన్ సానుభూతిపరులు మన మధ్యనే వున్నా… కాశ్మీర్ వేర్పాటు వాద నాయకులు మాత్రం మరీ అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. అడిగేది కాశ్మీర్ స్వాతంత్రం… కాని, నిస్సిగ్గుగా పాకిస్తాన్ కు మద్దతు పలుకుతుంటారు వీరు. క్రికెట్ విషయంలోనూ అంతే! ఛాంపియన్స్ ట్రోఫి గెలుపు తరువాత ఇండియాలో వుంటూ, ఇక్కడి వనరులు వాడుకుంటున్న ఒక కాశ్మీర్ వేర్పాటు నేత దిక్కుమాలిన ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ గెలుపును అభినందిస్తూ మురిసిపోయాడు. గౌతం గంభీర్ అదే పాకిస్తాన్ కు పోయి సంబరాలు చేసుకో అంటూ ఘాటుగా స్పందించాడు! కాని, ఇక్కడ మనం ఆందోళన చెందాల్సింది ట్వీట్ల గురించి కాదు. ఆ ట్వీట్ల వెనుక వున్న దేశ ద్రోహకరమైన ఆలోచనల గురించి…

 

కాశ్మీర్ లో తమకు ప్రత్యేక దేశం కావాలని రాళ్లు రువ్వే ఉన్మాదుల్ని పక్కన పెట్టినా … కేరళ నుంచి బెంగాల్ దాకా దేశంలోని చాలా చోట్లా పాక్ క్రికెట్ టీమ్ గెలవాలనుకునే దొంగలు వున్నారు. వీళ్లంతా భారతీయుల ముసుగులో వున్న జాతి శత్రువులు. వీరికి హిందూ, ముస్లిమ్ అన్న మతాలతో కూడా సంబంధం లేదు. కేవలం కసి, ఉగ్రవాదంపై మోజు మాత్రమే! ఇలాంటి వారి ఆటకట్టించాల్సిన అవసరం ఎంతైనా వుంది. భవిష్యత్లో భారత్ ఎప్పుడైనా పాకిస్తాన్ ను మూడు, నాలుగు ముక్కలు చేసి కాశ్మీర్ సమస్యే లేకుండా చేసినా… దేశం అంతర్భాగంలోని జాతి వ్యతిరేకుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు. ఎందుకంటే వారితో ఓడటమంటే ఏదో ఓ చిన్నా చితకా క్రికెట్ మ్యాచ్ ఓడిపోవటం కాదు. దేశ సంక్షేమమే పణంగా పెట్టడం…