20 మంది పిల్లలు సజీవ దహనం..
Published on: Thu Mar 9, 2017 11:07AM

అమెరికాలో ఘోరమైన అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... అమెరికాలోని గ్వాటెమాలా నగరంలోని సాన్‌జోస్ పిన్యులా అనాథ ఆశ్రమంలో మంటలు ఏర్పడి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది పిల్లలు సజీవ దహనమవ్వగా...మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలుపుతున్నారు. కాగా ఆశ్రమంలో సుమారు 800 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే కొందరు కావాలనే పరుపులకు నిప్పు అంటించడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.


