TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్ర ఆర్డినెన్స్ చించిపారేయాలి: రాహుల్ సంచలన వ్యాఖ్య

Published on: Fri Sep 27, 2013 6:57PM

 

Rahul Gandhi embarrasses UPA, ordinance on MPs complete nonsense, rahul gandi, congress, president, lalu prasad yadav

 

 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేర చరితులను రక్షించడానికి కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినేన్స్‌పై ఆయన మండిపడ్డారు. ఆర్డినెన్స్‌ను చింపి పారవేయాలని రాహుల్ పేర్కొన్నారు. ఇటీవల నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని సుప్రీంకోర్టు పేర్కొంటూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై 24న కేబినెట్‌లో చర్చ జరిపి ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్‌కు పంపారు. ఈ బిల్లు ఇంకా అక్కడే ఉంది.

 


బీహర్ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ పశువుల దాణ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ జరుగుతున్న విషయం తెలిసందే. నేరం రుజువు అయితే లాలూ ఎన్నికలలో పాల్గొనే అర్హత కోల్పోతారు. అందుకేసమే కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిందని పలువురు రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సమంజసమేనని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు.